ప్రతిభ కళాశాలల(సిఓఈ) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ప్రతిభ కళాశాలల(సిఓఈ) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ప్రతిభ కళాశాలల(సిఓఈ) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
PRATIBHA SCHOOL HM

ప్రతిభ కళాశాలల(సిఓఈ) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం 

రెబ్బెన(టైమ్‌టుడే):  2023- 24, విద్యా సంవత్సరానికి గాను ప్రతిభ కళాశాల( సిఓఈ) లలో, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు  దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని రెబ్బెన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ పచ్చల జ్యోతి  తెలిపారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ.. టీఎస్ డబ్ల్యూ ఆర్ఎస్ సెక్రటరీ నవీన్ నికోలస్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ప్రతిష్టాత్మకంగా నడపబడుచున్న 38 టీఎస్ డబ్ల్యూఆర్ సిఓఈ ల యందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపిసి ఎంఇసి, సిఇసి గ్రూపుల లో ప్రవేశాల కొరకు అర్హులైన విద్యార్థిని విద్యార్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరడం జరుగుతుందని, ప్రతిభ కళాశాలల యందు ఐఐటి, జేఈఈ, ఎన్ఈఈటి, సిఎంఎ, సిఎల్ఏటి పరీక్షల కొరకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రవేశ ప్రకటన పూర్తి వివరాల కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు   www.tswreis.ac.in  వెబ్ సైట్ .ను సందర్శించగలరన్నారు. దరఖాస్తు రుసుము రూ 200 దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరి తేదీ 15 జనవరి  2024 అని తెలియజేశారు.