సీఎం సీపీఆర్‌వో గా బోరెడ్డి అయోధ్య రెడ్డి
CM CPRO TELANGANA
సీఎం సీపీఆర్‌వో గా బోరెడ్డి అయోధ్య రెడ్డి
కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం.. సి ఎస్ ఉత్తర్వులు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (సీపీఆర్‌వో)గా మాజీ జర్నలిస్టు బి.అయోధ్య రెడ్డి నియమితులు అయ్యారు. మంగళవారం ప్రధాకార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసారు. ఈయన పలు మీడియా సంస్థల్లో పనిచేసి కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పిఆర్ఓ గా దూదిపల్ల విజయ్ కుమార్ నియమిస్తూ సిఎస్ ఉత్తర్వులు ఇచ్చారు కాగా, సీఎం రేవంత్‌రెడ్డి తన కార్యాలయంలో పనిచేసే బృందాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) టీమ్‌లో ఎవరెవరు ఉండాలో ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పనితీరు, సామాజిక న్యాయం ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్లు సమాచారం
