ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు
YEERIPLAM NEWS:
ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు
ఎర్రుపాలెం(టైమ్‌టుడే): మండల కేంద్రమైన ఎర్రుపాలెం రామచంద్రపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 75వ గణతంత్ర వేడుకలను శుక్రవారం ఘనంగానిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దండెం సత్యనారాయణ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , జాతిపిత గాంధీ మహాత్ముని చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం పతాకావిష్కరణ గావించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు .గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం విద్యా కమిటీ చైర్మన్ నండ్రు జనార్దన్ చేతుల మీదుగా అందజేశారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అప్పలరాజు,అంగన్వాడి టీచర్ దేవరకొండ వీరకుమారి, ఆయా సునీత, భాగ్యలక్ష్మి,దేవరకొండ భూషణం, వరుణ్,చంద్రమౌళి రోశయ్య ,రాజు తల్లిదండ్రులు పాల్గొన్నారు
ఎర్రుపాలెం(టైమ్‌టుడే):
