చంద్రబాబును జైల్లో పెట్టి బలహీన పరచాలనే జగన్ కుట్ర ఫలించలేదు

చంద్రబాబును జైల్లో పెట్టి బలహీన పరచాలనే జగన్ కుట్ర ఫలించలేదు

కృష్ణా జలాల కేటాయింపులపై పోరాడాలని చంద్రబాబు సూచించారు

చంద్రబాబును జైల్లో పెట్టి బలహీన పరచాలనే జగన్ కుట్ర ఫలించలేదు

కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసని ప్రపంచమంతా నమ్ముతోంది

జనం ఎపి హేట్స్ జగన్ అంటున్నారు

చంద్రబాబు జైల్లో ఉన్నా పార్టీని నడపగలరని జగన్ కు అర్థమైంది

టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పీఏసీ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్

*రాజమహేంద్రవరం :-* సాగునీటి ప్రాజెక్టులను, సాగునీటి రంగాన్ని ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందన్న దానిపైనే చంద్రబాబు బాధపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. కృష్ణా జలాల అంశంలో ప్రభుత్వ విధానంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగనుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు పయ్యావుల కేశవ్ చెప్పారు. ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపుల పున:సమీక్ష అంశంపై పార్టీ గట్టిగా పోరాడాలని చంద్రబాబు సూచించారని కేశవ్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, పయ్యావుల కేశవ్ మంగళవారం సాయంత్రం గం.4లకు ములాఖత్ అయ్యారు. అనంతరం కారాగారం బయట పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. ‘‘జైల్లో ఉన్న చంద్రబాబును కళ్లెదురుగా చూడగానే బాధేసింది. చేయని తప్పునకు శిక్ష అనుభవించడం విన్నాను..కానీ ఇప్పుడు కళ్లారా చూశాను.శిఖరం లాంటి వ్యక్తిని అలా చూసే సరికి బాధ కలిగింది. కలిసిన వెంటనే క్షేమ సమాచారం, తన పరిస్థితి గురించి కాకుండా కృష్ణా జలాల అంశంపై చంద్రబాబు మాట్లాడారు. జైల్లో పెట్టి చంద్రబాబును వీక్ చేయాలి అని జగన్ పన్నాగం ఫలించలేదని ప్రస్తావించిన అంశాలు చూసిన తరువాత అనిపించింది. కృష్ణా జలాలపై పార్టీ యంత్రాంగం గట్టి పోరాటం చేయాలని అలసత్వం కూడదని చంద్రబాబు చెప్పారు. పార్టీ నేతలు ఎందుకు మీరు చొరవ చూపలేదని చంద్రబాబు ప్రశ్నించారు. కృష్ణాజలాల అంశం ప్రజలు, రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించే చర్య అని చంద్రబాబు అన్నారు. కృష్ణాజలాల సమస్యలపై పార్టీ దృష్టిపెట్టాలని సూచించారు. చంద్రబాబు తన మంచిచెడ్డల గురించి కాకుండా ప్రజల కోసం ఆయన మాటలు, ఆలోచనలు సాగుతున్నాయంటే మానసికంగా ఎంత దృఢంగా ఉన్నారో అర్థమవుతోంది. జైల్లో పెట్టి ప్రత్యర్థులు రాజకీయంగా, మానసికంగా దెబ్బకొట్టాలని చూసినా చంద్రబాబు బలంగా తయారయ్యారు. రాష్ట్ర్రంలో జరిగే పరిస్థితులను చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. పార్టీకి కూడా దిశానిర్ధేశంతో పాటు...ప్రజల సమస్యలపై పోరాటం ఆపొద్దని చెప్పారు. నన్ను జైల్లో పెడితే పెట్టారు..కానీ ప్రజల సమస్యలపైనే మీ పోరాటం ఉండాలని సూచించారు. చంద్రబాబు తనపై కేసుల గురించి ఆందోళన చెందడం లేదు....రేపు కాకపోతే మరొకరోజైనా బయటకు వస్తానన్న ఆలోచనలో ఉన్నారు. పార్టీ, రాష్ట్రం అనే ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబులో ఉన్న కాన్ఫిడెంట్ చూశాక మాలోనూ ధైర్యం వచ్చింది. 

రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకూ ఏ ప్రాజెక్టునూ ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదు. ఈ విషయంలో చంద్రబాబుపోరాడుతుంటే అరెస్టు చేశారని పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు పోరాటానికి వస్తున్న ప్రజా స్పందన చూసి అంగళ్లలో అల్లర్లు సృష్టించి కేసు పెట్టారు. తర్వాత నంద్యాలలో వేరే కేసులో ఆయనను అరెస్టు చేశారని కేశవ్ అన్నారు. సాగునీటి రంగంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందడం వల్లే చంద్రబాబును కట్టడి చేయాలన్న ఆలోచనతో అక్రమంగా ప్రభుత్వం కేసులు పెట్టింది. రాజకీయ కుట్రతోనే చంద్రబాబు అరెస్టు అన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. జగన్ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. టీడీపీ నాయకత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు 6 నెలలకు ముందు కేసులు పెట్టడాన్ని చూస్తే సమస్యలు సృష్టించేందుకే అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. చంద్రబాబుపై పెట్టిన కేసులు నిజమైనవని ప్రజలు నమ్మడం లేదు. 54 దేశాల్లో చంద్రబాబుకు మద్ధతు గా ర్యాలీలు కార్యక్రమాలు జరిగాయి. తప్పు చేసిన వ్యక్తి వెనక తిరగడానికి భయపడే ఈ రోజుల్లో..చంద్రబాబును అరెస్టు చేశాక వేలాది మంది ఆయన వెంట నడుస్తున్నారు. టీడీపీ మరింత పటిష్టంగా తయారైంది..ఎన్నికల్లో బలంగా పోరాడతాం అని కేశవ్ అన్నారు.

వై ఎపి నీడ్స్ జగన్ అని ప్రచారం మొదలు పెట్టారని....ప్రజలు కూడా వై అనే అడుగుతున్నరని పయ్యావుల అన్నారు. పోలవరం ముంచినందుకు, జాబ్ కేలండర్ ఇవ్వనందుకు, రైతులను మట్టిలో కలిపినందుకు, సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందుకు వై ఎపి నీడ్స్ జగన్ అంటున్నారా? అన్ని ప్రశ్నించారు. ప్రజలు ఎపి హేట్స్ జగన్ అంటున్నారు. వై జగన్ అనే స్లోగన్ ద్వారా తన పై తానే జగన్ అనుమాన పడుతున్నారని కేశవ్ అన్నారు.

ప్రతిపక్ష నేతలపై, కార్యకర్తలపూ తప్పుడు కేసులు పెట్టి అందరినీ వాటిల్లో బిజీ అయ్యేలా చేయడమే జగన్ లక్ష్యం అని కేశవ్ అన్నారు. చంద్రబాబు అరెస్టు తనకు తెలియదని జగన్ అంటే నమ్మడానికి చంటిబిడ్డలు కూడా సిద్ధంగా లేరు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారో స్కూలు పిల్లాన్ని అడిగినా కక్షతోనే చేశారని చెప్తాడు. చంద్రబాబు లోపల ఉన్నా రాష్ట్రాన్ని నడిపించగలడన్న నమ్మకం జగన్ లో ఉంది. అందుకే చంద్రబాబు లోపలున్నా..బయటున్నా ఒకటే అని జగన్ భయపడుతున్నారు అని కేశవ వివరించారు. పవన్ కళ్యాణ్ పైనా మానసిక దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరికి ఎవరంటే భయమో వైసీపీ నేతల మాటలు చూస్తే తెలుస్తుంది. టీడీపీ, పవన్ కళ్యాణ్ తప్ప మరో అంశమే వైసీపీ నేతలు ఎత్తడం లేదు. జైల్లో చంద్రబాబు భద్రతపై చర్యలు తీసుకోవాలి..దీనిపై కేంద్రాన్ని, న్యాయస్థానాన్ని కోరుతాం.’’ అని పయ్యావుల కేశవ్ అన్నారు.