మాలలు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి

మాలలు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి

మాలలు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి 

అశ్వరావుపేట ఎస్సై శ్రీను ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలి

ప్రముఖ సామాజిక విశ్లేషకులు, బుద్ధవనం ప్రాజెక్ట్ మాజీ డైరెక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య 

ఘనంగా యూనిటీ ఆఫ్ మాల తృతీయ వార్షికోత్సవం

ఖమ్మం (టైమ్‌టుడే): మాల కులస్తులు సామాజికంగా ఆర్థికంగా ఎదిగిన నాడే నిజమైన అభివృద్ధి సాధించినట్లు అని ప్రముఖ సామాజిక విశ్లేషకులు , బుద్ధవనం ప్రాజెక్ట్ మాజీ డైరెక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు . యూనిటీ ఆఫ్ మాల ఖమ్మం జిల్లా సమితి తృతీయ వార్షికోత్సవ సభ ఖమ్మం బైపాస్ రోడ్డు లోని కృష్ణ ఫంక్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించారు . తొలుత సంఘం జెండాని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం ఎఫ్ గోపీనాథ్ ఆవిష్కరించారు . భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అతిధులు , సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు . అనంతరం జిల్లా అధ్యక్షుడు కందుల ఉపేందర్ అధ్యక్షతన జరిగిన సభలో కార్పొరేటర్ బిజీ క్లైమెంట్ ప్రారంభ ఉపన్యాసం చేశారు . ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. మాల కులస్తులు ఏ వర్గానికి తల వంచి బతకాల్సిన అవసరం లేదన్నారు . చరిత్రను మననం చేసుకొని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలన్నారు

. గౌతమ బుద్ధుడు చెప్పిన బుద్ధం, ధర్మం , సంఘం మూడు మాటల స్ఫూర్తితో అంబేద్కర్ చదువు , కదిలించు , నిర్వహించు అని చెప్పారని తెలిపారు . చదువంటే విద్య మాత్రమే కాదని చైతన్యం కావాలని , కదలిక చేయడం అంటే ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అని అన్నారు . అందరం కలిసి పోరాడితేనే సమాన హక్కులు , సమానత్వం సాధ్యమవుతుందని అంబేద్కర్ చెప్పారని తెలిపారు . అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శీను మాల అయినప్పటికీ అతని ఆత్మహత్యపై మాల కుల సంఘాలు , కులస్తులు స్పందించకపోవడం అత్యంత బాధాకరమన్నారు . ఎస్సై ఆత్మహత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు . అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్ల ఎదుట ధర్నా చేసి ఎస్సై కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు . నిత్యం దళితులపై జరుగుతున్న దాడులు , హత్యలు , అత్యాచారాలపై తిరగబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు . దళితుల్లో 12 లక్షల మంది యువత నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతున్నారని , 80 శాతం మంది పేదలు రెండు పూటలా మాత్రమే తింటున్నారని వారి బాగు కోసం ఏం చేయాలో ఆలోచించి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . దళితుల కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని , రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు . అంబేద్కర్ దళితులకు రాజ్యాంగంలోనే కాకుండా బ్రిటిష్ పాలనలో సైతం హక్కులు రిజర్వేషన్లు కల్పించేలా కృషి చేశారని తెలిపారు . దళితులకు రాజ్యాంగ ఫలాలు అందిన నాడే అసలైన అభివృద్ధి సాద్యమవుతుందన్నారు . గత మూడేళ్లుగా యూనిటీ ఆఫ్ మాల అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందని , భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించాలని ఆకాంక్షించారు . మాల కులస్తుల్లో ఎందరో మంచి వైద్యులు ఉన్నారని వాళ్ళ సహకారంతో గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేదలైన మాలలకు రక్తహీనత , ఇతర వ్యాధుల పై అవగాహన కల్పించి చికిత్స అందించాలని సూచించారు . డిగ్రీ, ఇంజనీరింగ్ దళిత యువతకు సెంటర్ ఆఫ్ దళిత్ ఎక్స్లెన్స్ ద్వారా ఉచిత శిక్షణ అందజేసి ఉద్యోగాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు . మాలల హక్కులు బలికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు . ఖమ్మం జిల్లా అని చైతన్యవంతమైన "మాల జిల్లా"గా మార్చాలని పిలుపునిచ్చారు . అనంతరం అతిధులకు యూనిటీ ఆఫ్ మాల సభ్యులు శాలువాలు కప్పి జ్ఞాపకాలు అందజేసి ఘనంగా సత్కరించారు . కార్యక్రమంలో విశిష్ట అతిథులు సామాజిక విశ్లేషకులు బొనిగేల రామారావు , ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కే జగదీష్ , పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ స్వర్ణకుమారి , డాక్టర్ బాబు రత్నాకర్ , కార్పొరేటర్ బిజీ క్లైమెంట్ , యూనిటీ ఆఫ్ మాల అధ్యక్షుడు కందుల ఉపేందర్ , ప్రధాన కార్యదర్శి అవుట మధు , వర్కింగ్ ప్రెసిడెంట్ జాగటి మధు , స్టీరింగ్ కమిటీ సభ్యులు సుఖ భోగి కోటేశ్వరరావు , గులగట్టు ఎల్లయ్య , చిలక బత్తిని కనకయ్య , మేడికొండ శౌరి , మోటాపోతుల బాబురావు , ప్రత్యేక అతిధులు మేము రత్నాకర్ , కొప్పుల అశోక్ , మద్దెల రవి , పిల్లి విజయపాల్ , మేకల కృష్ణ , సభ్యులు పాల్గొన్నారు .