ప్రజాపాలన దరఖాస్తు జిరాక్స్ సెంటర్లలో విక్రయాలు
ప్రజాపాలన దరఖాస్తు జిరాక్స్ సెంటర్లలో
జిరాక్స్ సెంటర్లలో ప్రజాపాలన దరఖాస్తు విక్రయాలు
రెబ్బెన(టైమ్‌టుడే): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో అభయహస్తం ప్రజా పాలన సంక్షేమ పథక దరఖాస్తు పత్రాలను రెబ్బెనలో కొన్ని జిరాక్స్ సెంటర్లు రూ 20, రూ 30 లకు అమాయక జనాలకు విక్రయిస్తున్నారని, ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన ఫారంలను ఉచితంగా తీసుకోవడానికి గ్రామపంచాయతీలో దరఖాస్తు పత్రాలు ఉంచినప్పటికీ ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రజా పాలన పత్రాలు విక్రయిస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకొని ప్రజలకు ఉచితంగా దరఖాస్తు ఫారాలు అందించాలని రెబ్బెన మండల డివైఎఫ్ఐ కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు చాపిడి శివ నాయకుడు రమేష్ పాల్గొన్నారు.
