విజయవాడ ప్రెస్ క్లబ్ అందరిది.
విజయవాడ ప్రెస్ క్లబ్ అందరిది.
ప్రభుత్వం స్వాధీనపర్చుకోవాలి..
అర్హులైన జర్నలిస్టులందరికి సభ్యత్వాలు కల్పించాలి..
ఒక యూనియన్ కబంద హస్తాల్లోనే ప్రెస్‌క్లబ్...
కలెక్టర్ ఢిల్లీరావును కోరిన జర్నలిస్టు జేఏసీ నేతలు...
అలా జరగటానికి వీల్లేదే.... ప్రెస్ క్లబ్‌లో అందరూ భాగస్వాములే...
దీనిపై విచారణ చేపిస్తాం : కలెక్టర్ ఢిల్లీరావు..
విజయవాడ(టైమ్‌టుడే):ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఎన్నో చీకటి కోణాలను వెలికితీస్తూ మెరుగైన సమాజం కోసంజర్నలిస్పులందరూ నిత్యం పాటుపడుతున్నారు. విజయవాడలో ఉన్న ప్రెస్‌క్లబ్ ఏపియూడబ్యుజే కబంద హస్తాల్లోనే చిక్కుకుని ప్రెస్‌క్లబ్ కార్యకలాపాలకు విరుద్దంగా జరుగుతున్నాయని ఆది నుంచి విమర్శలువినిపిస్తున్నాయి. ఇది అందరి ప్రెస్ క్లబ్ గా ఉండాలి, ప్రతి ఒక్క జర్నలిస్టుకు సభ్యత్వం కావాలనే సదుద్యేశంతో విజయవాడ మహానగరంలోని ఆయా జర్నలిస్టు సంఘాల నేతలంతా కలిసి జేఏసీగా ఏర్పాడి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుకు ప్రెస్ క్లబ్ ను కాపాడండి మహాప్రభో... అంటూ శుక్రవారం వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పలు జర్నలిస్టు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి జులై 1971 లో ప్రెస్‌క్షబ్ ను ప్రారంభించారని జె. ఏ. సి. నాయకులు పేర్కొన్నారు. కానీ ఏపియూడబ్యుజే మాత్రమే ఇక్కడ పెత్తనం చెల్లాయిస్తుందని అన్నారు. ఆది నుంచి యూనియన్ కార్యకలాపాలకు వినియోగించుకోవడమే తప్ప విజయవాడ నగరంలో జర్నలిస్టులుగా పనిచేసే వారందరికి ఉపయెగపడలేదని కలెక్టర్ దృష్టికి వారు తీసుకువెళ్లారు. కానీ అన్ని ప్రభుత్వ రాయితీలు పొందుతున్నారని ప్రెస్‌క్లబ్ మాటున యూనియన్ పెత్తనం చేస్తుందని అన్నారు. అలాగే ఏ ఒక్క జర్నలిస్టును ఆదుకున్న దాఖలాలు లేవని, కానీ
అక్కడ గంటలకు ప్రెస్‌మీట్ పెట్టుకునేందుకు 6 వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు వసూలుచేసినా జర్నలిస్టులు ఫ్యాన్ వేస్తే ఊరుకోరని కలెక్టర్ వద్ద నేతలు వాపోయారు. విజయవాడ నగరంలో 1500కు పైగా అక్రిడిటేషన్లు కలిగిన జర్నలిస్టులు ఉన్నారు కానీ ఆ యూనియన్ 122 సభ్యత్వాలే ప్రెస్‌క్లబ్ సభ్యత్వాలుగా చూపించి ఇటీవల ఎన్నికలు నిర్వహించడం దారుణమని అన్నారు. వెంటనే ప్రెస్‌క్లబ్‌లో జరుగుతున్న
కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించి ప్రెస్‌క్షబ్‌ను పరిరక్షించండి మహాప్రభో.. అంటూ విన్నవించారు. ప్రెస్‌క్లబ్ పేరు మీద కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేదని సోసైటీ యాక్ట్ ప్రకారం ఎన్నిక జరుగలేదని ఎన్నికల నయామవళిని తుంగలో తొక్కి అక్కడ యూనియన్ నాయకులే తమదైన శైలిలో రాజ్యమేలుతున్నారన్నారు. మెంబర్ షిప్‌లో గందరగోళం, జర్నలిస్టులకు ఏ అవసరం వచ్చినా వినియోగించుకోవడానికి వీలు లేకుండా వారి స్వంత భవనంలా ప్రెస్ క్షబ్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్వాదీనం చేసుకుని ఎన్నికను రద్దు చేసి ""అందరి ప్రెస్‌క్లబ్"" గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రెస్‌క్లబ్ పేరుతో నిధులు సేకరణ..
ప్రభుత్వ ఇరిగేషన్ స్థలంలో 1971 జూలై 7వ తేదీన ప్రెస్‌క్లబ్ నిర్మాణం జరిగిందని అప్పట్లో భవన నిర్మాణానికి
కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. . గతంలో రాజ్యసభ సభ్యులు దాసరి నాగభూషణం
పైస్‌క్షబ్ అభివృద్ది కోసం 2 లక్షల రూపాయలు, అప్పటి శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ 2 లక్షలు,ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు మల్లాది విష్ణు తన కోట కింద 15 లక్షల మంజూరుకు తమరికి సిపార్సుచేయడం జరిగిందని కూడా కలెక్టర్‌కు గుర్తు చేశారు. అంతెందుకు జర్నలిస్టు సంక్షేమం కోసం అంటూ ప్రెస్ క్లబ్ కు విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ద్వారా ఇంటి పన్ను, నీటిపన్ను పేరుతో లక్షలాది రూపాయలు
మినహాయింపు ఇవ్వడం జరిగిందని అన్నారు.రాష్ట్రంలోని ప్రెస్‌క్లబ్ లన్నీ యూనియన్లకు అతీతంగానే ఉన్నాయి..రాష్ట్రంలో అధికచోట్ల యూనియన్లకు అతీతంగా స్థానిక జర్నలిస్టు లందరూ ఏకతాటిపై ఉండి ప్రెస్‌క్లబ్‌లు నడిపించుకుంటున్నారని వారు కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లారు. కానీ అరకోర చోట్ల మాత్రమే యూనియన్ కబంద హస్తాల్లో నలిగిపోతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా ఉన్న వాటిల్లోనే అక్కడి జర్నలిస్టులందరూ కలిసి వచ్చి కలెక్టర్లకు ఫిర్యాదు
చేయడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలొ ప్రెస్‌క్లబ్ లు స్వాధీనం చేసుకున్నారని ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు. వీటిలాగానే విజయవాడ గాంధీనగర్‌లో ఉన్న ప్రెస్‌క్లబ్‌ను ప్రభుత్వం స్వాదీనపర్చుకుని జర్నలిస్టులందరికి మేలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రెస్‌క్లబ్ అంటే ఒక్కరి సోత్తు కాదని ఇది అందరి సోత్తుగా పరిగణించి విజయవాడలో జర్నలిస్టుగా ఉన్న ప్రతి ఒక్కరికి సభ్యత్వాలు కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. దీనితో కలెక్టర్ ఢిల్లీరావు వెంటనే స్పందించారు.
అలా జరగటానికి వీల్లేదే.... పెన్ క్లబ్‌లో అందరూ భాగస్వాములే...
దీనిపై విచారణ చేపిస్తాం -----కలెక్టర్ ఢిల్లీరావు..
జర్నలిస్టు జేఏసీ నేతంతా చెప్పిన వివరాల్లాన్నీ సవాదానంగా విన్న జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వెంటనే అలా జరగటానికి వీల్లేదే... ప్రెస్‌క్లబ్ అంటే అందరిది అని దానిలో అందరూ భాగస్వాములే అని తెలియజేశారు. దీనిపై వెంటనే విచారణ జరిపిస్తామని అందరికి సభ్యత్వాలు ఇచ్చి న్యాయం చేస్తామని అన్నారు. ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన వారిలో వివిధ సంఘాల నేతలు వీర్ల శ్రీ రామ్ యాదవ్, గాంధీ, కె. ప్రసాద్‌బాబు,
యేమినేని వెంకట రమణ, అనిల్ కుమార్, ఎ.వి.వి. శ్రీనివాసరావు,ప్రశాంత్, కోట రాజా, పి. బాబూరావు, వై.ఎన్. కిషోర్, మల్లిఖార్జునరావు, బాబు, ఎన్. శ్రీనివాసరావు,సురేష్ తదితరులు ఉన్నారు.
టైమ్‌టుడే.
