ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ పర్యటన.

ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ పర్యటన.

ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ పర్యటన

గుండాల(టైమ్‌టుడే): పినపాక నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ శుక్రవారం మ గుండాల మండలంలో పర్యటించి పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగానికి పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస అవరాలైన మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ర్యాంపు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. సౌకర్యాలు లేని పోలింగ్ కేంద్రాల్లో తక్షణమే సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకునున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగ, 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లు ఓటు హక్కు వినియోగానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. సెక్టోరియల్ అధికారులు నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సదుపాయాలు పరిశీలన చేయాలని ఎక్కడైనా సౌకర్యాలు కల్పించాల్సి ఉంటే తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వర్షాల వల్ల కోతకు గురైన చిరుమళ్ల - కరకగూడెం వంతెన మరమ్మత్తు పనులను పరిశీలించారు. పోలింగ్ కేంద్రం 35 లో ఓటర్లు ఓటు హక్కు వినియోగానికి వంతెన దాటి రావాల్సి ఉన్నందున రవాణాకు ఎలాంటి ఇబ్బంది పడకుండా మరమ్మత్తులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.