అబ్దుల్ కలాం స్మారక అవార్డుకు విజ్ఞత ఎంపిక

అబ్దుల్ కలాం స్మారక అవార్డుకు విజ్ఞత ఎంపిక

అబ్దుల్ కలాం స్మారక అవార్డుకు విజ్ఞత ఎంపిక

బషీర్ బాగ్(టైమ్‌టుడే): అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని జస్టిస్ నందా కార్యాలయంలో 15న జక్కుల విజ్ఞతకు అబ్దుల్ కలాం స్మారక అవార్డ్ 2023 ను అందజేసి శాలువా మెమొంటో పూలమాలతో సత్కరిస్తున్నట్టు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందా ముఖ్య అతిథిగా విచ్చేస్తారని తెలిపారు. జక్కుల విజ్ఞత ఐఐటీ పుస్తకాలకు విద్యావేత్త, కరెంట్ రైటర్, ఆమె ప్రస్తుతం శంశీర్ జంగ్ లోని శారద విద్యాలయంలో గణితశాస్త్రం, భౌతిక శాస్త్రంలో కో-ఆర్డినేటర్, ఫ్యాకల్టీ మెంబర్గా సేవలందిస్తున్నారు. ఒలంపియాడ్ పరీక్షల కోసం ప్రశ్నపత్రాలను సెట్ చేయడం వివిధ ఐఐటి ఫౌండేషన్ పుస్తకాలకు కంటెంట్ రాయడం బోధనా పద్ధతుల్లో నైపుణ్యం ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. జక్కుల విజ్ఞత ఎంటెక్ ఎంఎస్సీ ఫిజిక్స్, మ్యాథ్స్ బి.ఎడ్ చదివారు. విద్యార్థుల సంక్షేమ అభివృద్ధి కొరకు ఎనలేని ఎనలేని కృషి చేశారు