మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ పోట్రు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ పోట్రు

కలెక్టర్ కు స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, జిల్లారెవెన్యూ అధికారిణి
మేడ్చల్ కలెక్టరేట్, (టైమ్‌టుడే):మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ పోట్రును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్గా వచ్చిన గౌతమ్ పోట్రు సెర్ప్ సీఈవోగా విధుల నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ కు జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లా స్థాయి అధికారులు స్వాగతం పలికారు.
టైమ్‌టుడే.
