ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

 బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక 

ప్రకృతి పూల సోయగం "బతుకమ్మ"

పీర్జాదిగూడ,(టైమ్‌టుడే): బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో అమావాస్య నుండి ఆశ్యూజ మాస శుద్ధ పాడ్యమి వరకు తొమ్మిది రోజులు పాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అడ్డం పట్టేది బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అంటే బతుకు నిచ్చే తల్లి అని అర్థం. ప్రకృతి పూల సోయగంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. ఆదివారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో కార్పొరేటర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

 సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మల్లారెడ్డి 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పాల్గొని సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.సద్దుల బతుకమ్మ పండుగ ప్రకృతి పూల పండగని, బతుకమ్మ పండుగ రంగురంగుల పూలతో ఇండ్లలో బతుకమ్మను పేర్చి అందులో పసుపుతో గౌరమ్మను చేసి ముత్తయిదువలు గౌరమ్మ అమ్మవారిని పూజిస్తారు. తొమ్మిది రోజులు పూజించిన తర్వాత తొమ్మిది రకాల వంటకాలను చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పించి బతుకమ్మలను దైవ సన్నిధి లో పెట్టి మహిళలు పిల్లలు అందరూ చుట్టూ చేరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ కోలాటాలతో ఆటలు ఆడి బతుకమ్మను నీళ్లలో వదులుతారు, అనంతరం పసుపుతో చేసిన గౌరమ్మను మహిళలు పంచుకొని సౌభాగ్యంగా ఉండాలని ఆ గౌరమ్మను కోరుకుంటారు. వారి వెంట తీసుకొచ్చిన సభ్యులను (పిండి వంటలను)అందరూ పంచుకొని ఆరగిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు భీమిరెడ్డి నవీన్ రెడ్డి, మద్ది యుగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.