దళిత సీఎం కోసం సోనియాను కలిసి ఒప్పిస్తా..

Dailt CM Congress

దళిత సీఎం కోసం సోనియాను కలిసి ఒప్పిస్తా..
SAREVY SATYANARAYANA Ex.Centre Minister

దళిత సీఎం కోసం సోనియాను కలిసి ఒప్పిస్తా..

దళితులుఅంటేసీఎంకేసీఆర్ కి చులకన..

ఏబిసీడీ వర్గీకరణ పేరుతో బిజెపి డ్రామాలు..

కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ..

బషీర్ బాగ్, (టైమ్‌టుడే) : దళితుని సీఎం చేయాలని త్వరలో సోనియా రాహుల్ ప్రియాంకాలను కలిసి ఒప్పిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర

మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు కృతజ్ఞతగా ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా దగ్గరుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన తాను చేయించానని, తన కృషి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఆ ప్రకటన రాకపోతే కెసిఆర్ ఉండకపోయేదన్నారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని రోటి, కపడా, మఖాన్ ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ఆశించాం కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని, దీనిని ఎవరూ ఆపలేరన్నారు. కేసీఆర్ దళిత విరోధి విద్రోహి అని దళితులు అంటే సీఎం కేసీఆర్ కి చులకన అన్నారు. కెసిఆర్ బట్టి విక్రమార్కపై వ్యాఖ్యలు చేయడం యావత్తు దళిత సమాజాన్ని కించపరచడమే అన్నారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా బిజెపి కొత్త నాటకం ఆడుతుందన్నారు. ఏబిసిడి వర్గీకరణ పేరుతో డ్రామాలు చేస్తుందన్నారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే మేం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న బిజెపి వర్గీకరణ చేయలేదన్నారు. ఇప్పుడు మాయమాటలు చెబుతున్నారని, వర్గీకరణపై బిజెపికి చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్ తీసుకురావాలన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన మోడీ వర్గీకరణ చేయడం పెద్ద విషయం కాదన్నారు. మరోసారి దళితుల్ని మోసం చేసేందుకే బిజెపి కుట్రలు చేస్తుందన్నారు. బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుండి తొలగించి బిసిలను అవమాన పరిచారన్నారు. ముస్లిం లకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది మేమే అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని, ముస్లిం,ఎస్సి ఎస్టీ బిసిల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పుణ్యమా అని 4 శాతం ముస్లిం రిసర్వేషన్లు వచ్చాయన్నారు. ముస్లిమ్ లు కాంగ్రెస్ కు ఓటు వేయాలని, అధికారంలోకి వచ్చాక రాజ్యాంగాన్ని సవరించి ముస్లింలకు, గిరిజనులకు 10 శాతం రిసర్వేషన్లు ఇస్తామన్నారు. దేశంలో ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రావాలన్నారు. పెద్ద దొర మోడీకి రాం రాం, చిన్న దొర కేసీఆర్ కు బై బై అని ప్రజలు అంటున్నారన్నారు. కేసిఆర్ ఇంటికి పోవడం ఖాయం అన్నారు. బీజేపీలో కూడా నేనంటే నేనే సీఎం అని అంటున్నారని అన్నారు. బట్టిని అపోషిషన్ లీడర్ కాకుండా చేశారని, బట్టి సీఎం అయ్యే అవకాశం ఉందని దామోదర రాజనర్సింహ కూడా దళిత సిఎం లిస్ట్ లో ఉన్నారని అన్నారు. దళితుడైన నన్ను సోనియా కేంద్ర మంత్రిని చేసిందన్నారు. రాబోయే రోజుల్లో దేశానికి రాహుల్ ప్రధాని అవుతారన్నారు. నేను ఆయన క్యాబినెట్ లో కేంద్ర మంత్రిగా ఉంటానన్నారు. దళితులను కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం ప్రేమిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో టోచర్, గుంజా శ్రీనివాస్, సల్మాన్ రాజ్, బాలాజీ గాలి, కృష్ణ, పులి శివ పాల్గొన్నారు.