ఈశ్వరి బాయ్ జీవితం యువతకు ఆదర్శం కావాలి
ఎస్ఎం బూసిని సన్మానిస్తున్న హైకోర్టు జడ్జ్ బీభపాక నాగేష్ ట్రస్ట్ చైర్ పర్సన్ గీతారెడ్డి
ఈశ్వరి బాయ్ జీవితం యువతకు ఆదర్శం కావాలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేష్ బీమాపాక

రవీంద్ర భారతి (సిఎన్ఎన్ఐ): దీరవనిత ఈశ్వరి బాయ్ జీవితాన్ని ఈ తరం యువతకు పరిచయం చేస్తే వారు ప్రశ్నించటం సమస్యలపై పోరాడే తత్వం నేర్చుకుంటారని హైకోర్టు జస్టిస్ నాగేష్ భీమపాక పేర్కొన్నారు శుక్రవారం రవీంద్రభారతిలో ఈశ్వరివ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమె జయంతి కార్యక్రమం నిర్వహించగా ఈ సందర్భంగా ఈశ్వరి స్మారక పురస్కారం 2023ను అంబేద్కర్ వాది ప్రొఫెసర్ ఎంఎస్ భూషి కి అందజేశారు అనంతరం కార్యక్రమం చీఫ్ గెస్ట్ జస్టిస్ భీమపాక నాగేష్ మాట్లాడుతూ దేశంలో అనేక సమస్యలకు విద్యనే పరిష్కారం దొరుకుతుందని ఆయన అన్నారు వారి కుటుంబం విద్యాసంస్థలను నెలకొల్పిందని ప్రశంసించారు సభకు ట్రస్ట్ చైర్ పర్సన్ ఈశ్వరి భాయ్ కుమార్తె మాజీ మంత్రి గీతారెడ్డి అధ్యక్ష వహించారు. బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, విశ్రాంతి ఐఏఎస్ ఎస్సీ ఎస్టీ కమిషన్ విశ్రాంతి ఓ ఎస్ డి ఆర్ సుబ్బారావు. విశ్రాంతి ఐఏఎస్ అధికారి వినోద్ కుమార్, సామాజిక వేత హేమావతి భీమన్న డాక్టర్ పద్మాకర్, రామచంద్ర రెడ్డి, దళిత ఉద్యమ నేత జై బి రాజు, కే కే రాజా తదితరులు పాల్గొన్నారు.
