తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలి
కాంగ్రెస్ ఆగ్రనేతను కోరుతూ పిసిసి విస్తృతస్థాయి సమావేశంలో తీర్మానం
తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలి
కాంగ్రెస్ ఆగ్రనేతను కోరుతూ పిసిసి విస్తృతస్థాయి సమావేశంలో తీర్మానం
- పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి : దీప దాస్ ముని
- గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని పిప్పి చేసింది : భట్టి విక్రమార్క
- లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు
- రాష్ట్రాన్ని బారాస దోచుకుంది
- నెలకాకముందే హామీలపై ఆ పార్టీ పుస్తకం విడుదల చేసింది సీఎం రేవంత్ రెడ్డి విమర్శ
- 20 నుంచి రాష్ట్రమంతా పరిటిస్తామని వెల్లడి
- కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టిన పిసిసి అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ (సిఎన్ఎన్ఐ): లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ దీపదాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మూడు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్‌గా దీపాదాస్ మున్షీకి అభినందనలు తెలుపుతూ తొలి తీర్మానం, తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమన్వయంతో పనిచేసిన మాణిక్‌రావు ఠాక్రేను అభినందిస్తూ రెండో తీర్మానం, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియాగాంధీని పోటీ చేయాలని కోరుతూ మూడో తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యతను తీసుకుంటామన్నారు. ఈ బాధ్యత తమదే అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నామన్నారు. 17 సీట్లలో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్ సభ స్థానాలు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇంఛార్జిలతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని… 20వ తేదీ తర్వాత క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానన్నారు.
గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు
సమావేశంలో అనంతరం సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ మీడియా ఇన్చార్జి సుజాత పౌల్ మీడియాకు వివరాలు వెల్లడించారు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తాం ప్రజలనుంచి వచ్చే సూచనలు సలహాలను ఈ కమిటీ ద్వారా తీసుకోవాలని సమావేశంలో నిర్మించారు రాష్ట్రాన్ని పెట్టి బడులు కోసం 14న సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ సమావేశాలకు వెళ్ళనున్నారు. అక్కడ నుంచి వచ్చే తర్వాత పార్లమెంట్ నియోజకవర్గం నియోజకవర్గాల వారీగా సమీక్షలు ఉంటాయి అని వివరించారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు దామోదర్ రాజనర్సింహ కొండా సురేఖ సీతక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు పిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు వంశి చందర్ రెడ్డి ఎమ్మెల్యేలు వంశీకృష్ణ ఆది శ్రీనివాస్ కుంభ అనిల్ కుమార్ రెడ్డి పిసిసి కార్యనిర్వహణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతలు అజారుద్దీన్ అంజన్ కుమార్ మదియాష్కి గౌడ్ విహెచ్ షబ్బీర్ అలీ సంపత్ కుమార్ పాల్గొన్నారు
