తెలంగాణ సమగ్రాభివృద్ధి కెసిఆర్ తోనె సాధ్యం ---ఎమ్మెల్యే మాణిక్ రావు

తెలంగాణ సమగ్రాభివృద్ధి కెసిఆర్ తోనె సాధ్యం ---ఎమ్మెల్యే మాణిక్ రావు

తెలంగాణ సమగ్రాభివృద్ధి కెసిఆర్ తోనె సాధ్యం

---ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ టౌన్ (టైమ్‌టుడే): తెలంగాణా సమగ్రాభివృద్ధి సిఎం కెసిఆర్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం, జీర్లపల్లీ కాంగ్రేస్ గ్రామ వార్డు సభ్యులు తో పాటు 15 మంది నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్శితులై పార్టీలో వరదలుగా వచ్చి చేరు తున్నారని, వారందరికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బెవరైజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాణిక్ రావు ప్రజలకు అందు బాటులో ఉండి, వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నందున రెండవ సారి మాణిక్ రావును ఎమ్మెల్యే గా గెలుపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.