జహీరాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే
జహీరాబాద్ టౌన్ (టైమ్‌టుడే): జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మాణిక్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణం లోని 8,9,10,11 లలో టిఎస్ఐడిసి చైర్మన్ యండి తన్వీర్, ఎన్నికల పార్టీ ఇంచార్జ్ దేవి ప్రసాద్ లతో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. ఆయా వార్డు ప్రజలు ఎమ్మెల్యే మాణిక్ రావు కు తిలకం దిద్ది, మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిఆర్ యుసిసి సభ్యులు షేక్ ఫరీద్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటా రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లు మహంకల్ సుభాష్, అల్లాడి నర్సింహులు, మాజీ జడ్పిటిసి మాణికమ్మ, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డీ, మాజీ కౌన్సిలర్ లు నామ రవికిరణ్, తంజిం, రాములు నేత, మోతిరాం, జహంగీర్, అబ్దుల్లా, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు సయ్యద్ మొహియొద్దిన్, నాయకులు బండి మోహన్, శివప్ప, సిరాజ్, ఇస్మాయిల్, మొహమ్మద్ అలి, పాండు యాదవ్, మొహమ్మద్ అక్బర్, మంజుల, అనుషమ్మ, షీలా రమేష్, తులసీదాస్ గుప్తా, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
