మర్రి రాజశేఖర్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలి మంత్రి తన్నీరు హరీష్ రావు

మర్రి రాజశేఖర్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలి మంత్రి తన్నీరు హరీష్ రావు

మర్రి రాజశేఖర్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలి

మంత్రి తన్నీరు హరీష్ రావు

మల్కాజ్ గిరి, (టైమ్‌టుడే): తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ

 సమ్మేళన సభకు ముఖ్య అతిథిగా మంత్రి తన్నీరు హరీష్ రావు,మంత్రి చామకూర మల్లా రెడ్డితో కలిసి హాజరయ్యారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గడిచిన 9 సంవత్సరాల బి ఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ముఖ్యంగా ఆసరా పెన్షన్లు, విద్యా వైద్య రంగాల్లో, మెరుగైన సేవలు అందిస్తుందని తెలంగాణ దేశానికి దిక్సూచిగా గా మారిందని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి

బిఆర్ఎస్ పార్టీ కి హ్యాట్రిక్ తప్పదని మంత్రి హరీష్ రావు అన్నారు.

మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపు ఖాయం బి ఆర్ ఎస్ మల్కాజ్గిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి సేవా గుణం కలిగిన మంచి నాయకుడిని, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు వెన్ను దండుగా ఉండి సేవ చేస్తున్నారని, బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణలో బి ఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి హ్యాట్రిక్ సాధిస్తుందని, గత ఎమ్మెల్యే మల్కాజిగిరిలో ప్రజలకు ఈరోజు అందుబాటులో లేరని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే నాయకుడిగా మరి రాజశేఖర్ రెడ్డి గెలుపు ఖాయమని

, బి ఆర్ ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.