ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు

ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు

ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు
ఎర్రుపాలెం(టైమ్‌టుడే):
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ఆదేశానుసారం మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎర్రుపాలెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సోనియా గాంధీ 77వ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని వయోభేదం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా,ఎన్నిసార్లైనా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్,సిటీ బస్,మెట్రో బస్సుల్లో ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చునని ఇది సోనియమ్మకు కానుకగా తొలి అడుగు వేసిందని ఇది రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ పరిణామంఅనికొనియాడారు.మహిళలు ఆధార్ కార్డు గాని,పాన్ కార్డు గాని ప్రభుత్వం  గుర్తింపు పొందిన ఏదైనా కార్డును. కండక్టర్కు చూపించాలని, సూచించారు.మిగిలిన హామీలను కూడా తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామనితెలిపారు. కార్యక్రమంలో బండారు నరసింహారావు, భద్రాచలం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ ఐలూరి వెంకటేశ్వర రెడ్డి ,మీడియా ఇన్ చార్జిమల్లెల.లక్ష్మణరావు, శీలం ప్రతాపరెడ్డి, ఎస్.కెబాషా అనుమోలు కృష్ణారావు,  ఎంపీపీ దేవరకొండ శిరీష, మహిళామండలి అధ్యక్షురాలు గంటా తిరుపతమ్మ , శీలం ఉమామహేశ్వరి,కడియం శ్రీనివాసరావు, దేవరకొండ ఏడుకొండలు,బండ్ల ఆత్మ ప్రసాద్, షేక్ ఇస్మాయిల్, జి బాబురావు,దేవరకొండ అనిల్ కుమార్, వివిధ హోదాలో ఉన్న  కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.