డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
మధిర (టైమ్‌టుడే): మంగళవారం స్థానిక శ్రీనిధి డిగ్రీ కళాశాల నందు, పూలను పూజించి, పకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల పూల పండగ.... బతుకమ్మ వేడుకలను కళాశాల ప్రిన్సిపాల్ శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి శ్రీనిధి కళాశాలల చైర్మన్ అనిల్ నెహ్రూ,జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ అనిల్ నెహ్రూ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయినా మన బతుకమ్మ పండుగను మన కళాశాలలో ఘనంగా జరుపుకుంటున్న అందుకు సంతోషం. కళాశాల విద్యార్థులు అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయముగా తిరిగిచూ విద్యార్థినిల గాజుల సవ్వలతో బతకమ్మకు స్వాగతం పలికి బతుకమ్మల తయారుచేసిన విద్యార్థినులకు ప్రోత్సాహ బహుమతులు అందజేసినారు.
