6 గ్యారెంటీ స్కీములలో దరఖాస్తు చేసుకున్న ఉద్యమకారులు

ప్రజా పాలన కు దరఖాస్తు చేసుకున్న ఉద్యమకారులు

6 గ్యారెంటీ స్కీములలో  దరఖాస్తు చేసుకున్న ఉద్యమకారులు
TELANGANA PEOPLES

ప్రజా పాలన కు దరఖాస్తు చేసుకున్న ఉద్యమకారులు

రెబ్బెన(టైమ్‌టుడే): 2009 నాటి తెలంగాణ ఉద్యమంలో రెబ్బెన మండలంలోని ఉద్యమ కారులు పలు నిరసనలు తెలిపి జైలుకు వెళ్లడం జరిగింది. అలాంటి వారి కోసం  ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 6 గ్యారెంటీ స్కీములలో భాగంగా 5 స్కీములను తక్షణం నెరవేర్చే ఉద్దేశంతో చేపట్టిన ప్రజా పాలన  దరఖాస్తు పత్రాలలో ఇంగిరమ్మ గృహాలు పథకంలో భాగంగా  కేసులు నమోదైన ఉద్యమకారుల కొరకు  ప్రత్యేక పట్టికను కేటాయించడం జరిగింది. దాంతో మండలంలో జైలుకు వెళ్లి వచ్చిన ఉద్యమ కారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ దుర్గం రవీందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారులను ఆదుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైందని .. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను గుర్తించడం సంతోషకారమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజా పాలన దరఖాస్తులో ఉద్యమకారుల అంశం పెట్టడాన్ని ఉద్యమకారుల ఫోరం స్వాగతిస్తుందని అన్నారు. ఉద్యమ కారులను గుర్తించేందుకు కమిటీ వేయాలని కోరారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఉద్యమ కారులను ఆదుకోవాలని కోరారు.