ఉప్పల్ నియోజకవర్గంలో గ్రాఫ్ పడిపోతున్న బండారి లక్ష్మారెడ్డి

టిఆర్ఎస్ ఉప్పల్ గ్రాఫ్

ఉప్పల్ నియోజకవర్గంలో గ్రాఫ్ పడిపోతున్న బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ నియోజకవర్గంలో గ్రాఫ్ పడిపోతున్న బండారి లక్ష్మారెడ్డి

అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యమకారులు...

పాదయాత్రలో స్పందించని ఓటర్లు....

ఆత్మవిశాసమే కోప్పముంచేనా ....

ఉప్పల్(టైమ్‌టుడే): ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుంది. ఉద్యమకారుల అసహనం, కార్యకర్తల నిరుత్సాహంతో బిఆర్ఎస్ కు సంస్థాగత ఓటర్లు దూరమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.బిఆర్ఎస్ కు నమ్ముకొని ఉన్న నాయకులు, కార్యకర్తలను అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం పాత కాంగ్రెస్ నాయకులను ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు నమ్ముకోవడంతోనే నిక్కర్సైన బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు దూరమవుతున్నారని అపవాదం లేకపోలేదు.ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలో కాప్రా డివిజన్, ఏఎస్ రావు నగర్ డివిజన్, చర్లపల్లి డివిజన్, మల్లాపూర్ డివిజన్,నాచారం డివిజన్, ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఉప్పల్ డివిజన్,చిలకనగర్ డివిజన్, రామంతపూర్ డివిజన్, హబ్సిగూడ డివిజన్ ప్రతిగా చూసుకుంటే మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ కే పడే అవకాశాలున్నట్లు బిఆర్ఎస్ నాయకులే బహాటంగా చెప్పుకుంటున్నారు.

డబ్బులు నమ్ముకుంటే ఓట్లు పడేనా....

బండారి లక్ష్మారెడ్డి ఓటర్లను డబ్బులతో కొనుక్కోవచ్చు అని ధీమాతో ఉండడం వల్లే ఓటమికి దారులు వేసుకుంటున్నారు. బూతు నాయకులను నమ్మకపోవడం పట్ల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో నాయకులను కార్యకర్తలను అవహేళన చేసేలా ప్రవర్తించడంతో ఓటమికి కారణాలు కనబడుతున్నాయి.

బిఆర్ఎస్ కు దూరమవుతున్న ఉద్యమకారులు....

బండారి లక్ష్మారెడ్డి వ్యవహార శైలి నచ్చక ఉద్యమకారులు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.నిక్కర్సైనా నాయకులను,కార్యకర్తలను బిఎల్ఆర్ అనుచరులను చెప్పుకుంటున్న కొంతమంది నాయకులు అవహేళన చేయడంతోనే పార్టీని వీడుతున్నట్లు బహిరంగంగా చెప్పుకుంటున్నారు.ఫలితంగా కాప్రా, ఉప్పల్ సర్కిల్ వారిగా బిఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితిలు నెలకొన్నాయి.మెజార్టీగా కాంగ్రెస్ అభ్యర్థి వైపే బిఆర్ఎస్ నాయకులు మొగ్గు చూపడం కోసం మెరుపు.

 పాదయాత్రలో స్పందించిన నాయకులు కార్యకర్తలు...

 బిఆర్ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి డివిజన్లో వారీగా పాదయాత్ర చేస్తూ పూర్తిస్థాయిలో నాయకులు కార్యకర్తలు స్పందించడం లేదు.పాదయాత్రలో నాయకులను వాడుకొని స్థానిక కార్పొరేటర్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో అనునిత్యం ప్రజల్లోకి వెళ్లే కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.బిఆర్ఎస్ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రచారం చేయకుండా కేవలం కార్పొరేటర్ల మెప్పు కోసమే పాదయాత్ర చేస్తే ఫలితం ఏముంటుందని నాయకులు ప్రశ్నిస్తున్నారు.