జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం పాఠశాల విద్యార్థిని

జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం పాఠశాల విద్యార్థిని

జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం పాఠశాల విద్యార్థిని
ఎర్రుపాలెం (టైమ్‌టుడే): 
ఎర్రుపాలెం మండలం భీమవరం ఏమి రెడ్డి వెంకట్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని సిహెచ్ దుర్గ భవాని జాతీయస్థాయి సబ్ జూనియర్ ఖో-ఖో పోటీలలో ప్రతిభ కనపర్చిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుభద్ర దేవి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవంబర్ నెలలో మెదక్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాల కు ఎంతో అరుదైన గౌరవం అని ఈనెల 13వ తేదీ నుండి 18 వ తారీకు వరకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరుగు 33వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఖో-ఖో పోటీలలో తెలంగాణ రాష్ట్రానికి దక్కిన అరుదైన అవకాశం అని ఆమె తెలిపారు. ఎంపికైన విద్యార్థినిని గ్రామ సర్పంచ్ జయలక్ష్మి, ఎస్ఎంసి చైర్మన్ లక్కిరెడ్డి కృష్ణారెడ్డి, జెడ్పిటిసి శీలం కవిత, ఎంపీటీసీ సంక్రాంతి కృష్ణారావు, సేగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అభినందించి జాతీయస్థాయిలో కూడా పాఠశాలకు మంచి పేరు తేవాలని, విద్యార్థినీ విద్యార్థులకు ఆట పోటీలలో చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర, జాతీయ స్థాయిలలో నిలవడానికి కారణమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడు గూడూరు సత్యనారాయణ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు.