అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే లక్ష్యం: మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకృష్ణ
అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే లక్ష్యం : మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకృష్ణ
బషీర్ బాగ్, (టైమ్టుడే): రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే మాలమహానాడు లక్ష్యమని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ, పుజల ఆస్థులను మొత్తం అమే బీజేపి ఆదీవాసీ గిరిజన, దళిత, బలహీన వర్గాల మహిళలను అత్యాచారాలు, హత్యలు చేసి చివరకు శవాలను కూడా బూడిద చేసిన ఉన్మాదులు ఉన్న బిజేప్పిన ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై ధర్నా చేసిన రైతులను ట్రాక్టర్స్, కార్లతో తొక్కి చంపిన హంతకుల పార్టీని ఖచ్చితంగా ఓడిస్తాంమన్నారు. అలాగే తెలంగాణలో భారత రాజ్యాంగం నమ్మనని బహిర్గతంగా మాట్లాడిన గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్, గూడు అరవింద్ లకు పోటీ చేసే నైతిక అర్హత లేదన్నారు. భారత న్యాయస్థానం, జాతీయ ఎస్సీ కమిషన్, భారత ఉన్నత ఎస్సీ పార్లమెంట్ ఎపెక్స్ కమిట్ లు తీరస్కరించిన ఎస్సీ వర్గీకరణను తెలంగాణలో తిరిగి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమాన పరచడమే అన్నారు. కనుక ఆయన ఎక్కడ పోటి చేస్తే ఆ నియోజక వర్గంలో మాలలు ఆయన వ్యతిరేకంగా పనిచేసి ఓడిస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులకు మందకృష్ణ మాదిగ బినామీగా ఉన్నారని ఆరోపించారు.
టైమ్టుడే.
