పేదలను ఆదుకోండి అభాగ్యులను ఆదరించండి
కొత్త సంవత్సరం వేళ మానవత్వం తో ముందుకు సాగండి
సమాజంలో బతుకుతున్న మనమంతా మానవతా దృక్పథంతో ముందుకు వెళ్లాలని, ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు తోడుగా ఆపదలో ఉన్న నిరుపేదలకు అభాగ్యులకు అండగా నిలవాలని, ఎవరికి తోచినంత వారు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని , నూతన సంవత్సర సందర్భంగా ప్రముఖ సామాజిక కార్యకర్త అడ్వకేట్ కర్నె రవి పిలుపునిచ్చారు. ఈనాటికి ఎందరో అభాగ్యులు నిరుపేదలు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక ఇబ్బందులు పడుతున్నారని, అటువంటివారిని గుర్తించి వారికి తోచిన సహాయం చేసే విధంగా యువతీ యువకులు ముందుకు సాగాలని అన్నారు. చదువు రానివారు మీసేవ సెంటర్ల దగ్గర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర దరఖాస్తులు రాయడంలో ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి వారికి చదువుకున్న విద్యార్థులు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని అన్నారు. సోమవారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో శివలింగాపురం గ్రామనివాసి జినగు గంగయ్య (విజ్ఞాన్ స్కూల్ వ్యాన్ క్లీనర్) గుండె పోటుతో చనిపోయిన విషయం తెలుసుకుని, సక్రు సహాయంతో 25 కేజీల బియ్యాన్ని సహాయంగా మణుగూరు మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ చేతుల మీదుగా మృతుని కుంటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో లాయర్ నాగార్జున రెడ్డి, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
