ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

పీర్జాదిగూడ,(టైమ్‌టుడే): పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో వరంగల్ ప్రధాన రహదారి రామ్ రాజ్ కాటన్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి,టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రష్ యాదవ్, టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి రెడ్డి హరివర్ధన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ లు ప్రారంభిస్తారని తుంగతుర్తి రవి తెలిపారు. నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మేడిపల్లి శివాలయం నుండి పార్టీ కార్యాలయం వరకు సుమారు 1000 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.