కాలనీ సమస్యలు పరిష్కరిస్తా బండారి లక్ష్మారెడ్డి
కాలనీ సమస్యలు పరిష్కరిస్తా బండారి లక్ష్మారెడ్డి
బి అర్ ఎస్ లో పలువురు చేరికలు
ఉప్పల్, (టైమ్‌టుడే): ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని హబ్సిగూడ డివిజన్ పి ఎన్ టి కాలనీవాసులు కంచి మనోహర్ ఆధ్వర్యంలో బండారి లక్ష్మారెడ్డి కి కాలనీ సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు.50 సంవత్సరాల నుండి అక్కడ నివాసముంటున్న వారికి ఇల్లు రిజిస్ట్రేషన్ పత్రాలు, మున్సిపల్ పర్మిషన్, కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లులు అన్నీ ఉన్నా పిఎన్టి కాలనీ యూనివర్సిటీ హద్దుల్లో ఉండడం వలన ఇళ్ల నిర్మాణా పై అంతస్తులు కట్టుకోవడానికి ఇది మా భూమి అని పర్మిషన్ ఇవ్వడం లేదు అని కాలనీవాసులు తెలిపారు.
పిఎన్టి కాలనీవాసుల సమస్యలపై బండారి లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించి ఉన్నత అధికారులతో మాట్లాడి వారి కాలని సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు ఎలాంటి సమస్యలైనా ఉంటే నేనున్నానని ధైర్యం చెప్పి వారికి సహాయకారకాలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించడమే నా లక్ష్యం అని బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
అనంతరం ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన రిటైర్డ్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిస్ ఖాజా మొయిద్దిన్, సత్యనారాయణ రెడ్డి, రామాచారి, రుక్కయ్య, వేణుగోపాల్, వెంకటేష్, తదితరులు బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో బి అర్ ఎస్ పార్టీలో చేరారు.బండారి లక్ష్మారెడ్డి విజయానికి కాలనీవాసులు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బండారి లక్ష్మారెడ్డి తోనే ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పి ఎన్ టి వాసులు బాలకృష్ణ, బిక్షపతి గౌడ్, దోషల సత్యనారాయణ, రాము యాదవ్, దోశల రవి, మల్లేష్, అనిల్, వాసు, శంకర్, మహిళలు స్రవంతి, సంధ్య, అనూష,నిర్మల, కవిత
టైమ్‌టుడే.
