తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో దేశంలోనే ముందుంది: పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో దేశంలోనే ముందుంది:  పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో దేశంలోనే ముందుంది:రాష్ట్ర పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

కాప్రా(టైమ్‌టుడే): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దేశంలోనే ముందు స్థానంలో ఉందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుకు నిదర్శనమని,రైతులు,పేదలపై ప్రేమ ఉన్న నాయకుడు దేశంలో కేసీఆర్ కంటే ఎవరూ లేరని రాష్ట్ర పురపాలక, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.గురువారం మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన ఉప్పల్ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశనికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కె సిఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా చెయాలిసిన బాధ్యత బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తల పై ఉందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలనీ పిలుపునిచ్చారు. అనంతరం ఉప్పల్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు.ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధి కి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.నాచారం డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కేటీఆర్ గారికి నాచారంలోని రెండు ప్రధాన సమస్యలను వివరించారు.

చాలాకాలంగా గుడిసెలలో నివసిస్తున్న ఏపీ ఫుడ్స్ గుడిసె వాసులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న రహేజా విస్తా అపార్ట్మెంట్ వాసులు వాళ్ల ను ఇండస్ట్రియల్ నుండి రెసిడెన్షియల్ కు కన్వర్షన్ చేయాలని కోరారు.

ఎన్నికల తర్వాత తప్పకుండా చేస్తామని కేటీఆర్ గారు హామీ ఇచ్చారు.అదేవిదంగా చిలుక నగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ముదిరాజ్ అంత కేటీఆర్ కు కారు బహుకరించారు.రాబోయే ఎన్నికల్లో బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి కానుకగా ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎన్నికల ఇంచార్జి రావుల శ్రీధర్ రెడ్డి,మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్,కార్పొరేటర్లు సాయిజెన్ శాంతి,బొంతు శ్రీదేవి యాదవ్,జెరిపోతుల ప్రభుదాస్,మాజీ కార్పొరేటర్లు గుండారపు శ్రీనివాస్ రెడ్డి,గోల్లూరి అంజయ్య,పజ్జురి పావని మణిపాల్ రెడ్డి,గంధం జ్యోత్స్నా నాగేశ్వరరావు,గోపు సరస్వతి,గ్రేటర్ నాయకులు సాయి జెన్ శేఖర్,కాసం మహిపాల్ రెడ్డి,సోమశేఖర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి,రాపోలు సతీష్,ఆర్ ఉపేందర్ రావు,దుర్గా మాదవి, సీనియర్ నాయకులు కార్యకర్తలు,బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.