కొత్తగుంపు, ఏ కాలనీతండా గ్రామాల్లో ముగ్గుల పోటీలు
కొత్తగుంపు, ఏ కాలనీతండా గ్రామాల్లో ముగ్గుల పోటీలు
కొత్తగుంపు, ఏ కాలనీతండా గ్రామాల్లో ముగ్గుల పోటీలు
టేకులపల్లి(టైమ్‌టుడే): టేకులపల్లి మండలం భద్దుతండ పంచాయతీ పరిధిలోని కొత్తగుంపు (తుమ్మలచెలక) గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. బద్దుతండ ఎం పీ టి సి వూకే రామకృష్ణ ఆధ్వర్యములో ముగ్గుల పోటీతో పటు తాడు లాగుడు పోటీలు కూడా నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని గత పది సంత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా నిర్వహించినాట్లు ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నాటికి పంట ధాన్యం ఇంటికి వచ్చిన సందర్భముగా రైతులు సిరిసంపదలు వెల్లివిరుస్తాయని , సంస్కృతి, సంప్రదాయాలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంతున్నట్లు తెలిపారు. ముగ్గుల పోటీల్లో ప్రధమ బహుమతి పూనెo జగదీశ్వరి, ద్వితీయ బహుమతి ఈసం హైమవతి, తృతీయ బహుమతి వూకే సౌదర్య, నాలుగవ బహుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే తాడు లాగుడు పోటీలో మహిళ విభాగంలో ప్రథమ బహుమతిని ఈసo మరమ్మ జట్టు, ద్వితీయ బహుమతి వూకే పార్వతీ జట్టు గెలుసుకున్నారు. పురుషుల విభాగంలో ప్రథమ బహుమతిని ఈసం ప్రసాద్ జట్టు , ద్వితీయ బహుమతి కోరం సర్వేశ్ జట్టు గెలిశారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా హాజరైన పీఏసిఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, టి ఎస్ ఏటీఎఫ్ రాష్ట అధ్యక్షులు మోకాళ్ళ శ్రీనివాసరావులు మాట్లాడుతు అందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు ముందు తరాలకు అందించటానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిచాలన్నారు . ఈ యొక్క కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్, పాయం రాధ, గంగారాం, ఏరం బుచ్చయ్య, సనప రామారావు, నరేష్, ఈసం జగదీష్ (చంటి), గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. టేకులపల్లి పంచాయతీలోని ఏ కాలనీ తండా గ్రామంలో కూడా ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచి బోడ సరిత, ఏ ఈ సక్రు, గ్రామస్తులు పాల్గొన్నారు.
