సమస్యల నిలయంగా ప్రభుత్వ పాఠశాలలు

ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ

సమస్యల నిలయంగా ప్రభుత్వ పాఠశాలలు

జూలూరుపాడు మండల వ్యాప్తంగా నరసాపురం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ బృందం విద్యార్థులతో మాట్లాడి పలు సమస్యలు వెలికి తీసింది.గత ప్రభుత్వంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో నాలుగు రూములో ఏర్పాటు చేయడం జరిగింద ని అప్పుడు ఎమ్మెల్యే లవడ్యా రాముల నాయక్ ఓపెన్ చేశారు అవి ఇప్పటివరకు అందులో గాని ఇంకా పూర్తి స్థాయిలో పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని రూములు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న ప్రభుత్వ యంత్రాగం నిమ్మకు నీరు ఎత్తి నట్లుగా వ్యవహారిస్తుందని వంశీ అన్నారు.ప్రభుత్వ పాఠశాల అనేక సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా మౌలిక వసతులు ఏర్పాటు చెయ్యకుండా విద్యార్థులు విద్యను ఎలా అభ్యసిస్తారని అయన ఆవేదన వ్యక్తం చేసారు మినలర్ వాటర్ సావుకార్యం ఏర్పాటు చెయ్యాలని విద్యార్థుల చిన్న చూపు చుస్తేయ్ ఊరుకునేదే లేదని అయన ప్రభుత్వన్ని హెచ్చరించారు.తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలు తక్షణ పరిష్కరించాలి లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థులు ఉద్యమాలు నిర్వహిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతూ వంశీ హెచ్చరించారు కార్యక్రమంలో గుగులోతు అఖిల్, సాయి ,రామ్ చరణ్ ,అనిల్ కుమార్ విద్యార్థులు తదుపరులు పాల్గొన్నారు