సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

 కొత్తగూడెం(టైమ్‌టుడే): నాగా సీతారాములు కేటీపీఎస్ కార్మిక నాయకులు గొర్రె వేణుగోపాల్ నివాసంలో కేటీపీఎస్ కార్మిక నాయకులు కట్కూరి రవి, గొర్రె వేణుగోపాల్ లతో కలిసి కేటీపీఎస్ లోని సమస్యల పట్ల చర్చించారు. కార్మికుల సమస్యలను, ఆర్టిజన్ సమస్యలను సాధ్యమైనంత త్వరగా డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మాత్యులు మల్లు భట్టివిక్రమార్క దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా నాగా సీతారాములు ను శాలువాతో సన్మానించి, పూలదండతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పులిపాక రమేష్, వెంకన్న, భాస్కరరావు, శ్రీనివాసరావు తదితర కేటీపీఎస్ కార్మికులు పాల్గొన్నారు.