ఉప్పల్ గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగురావేస్తాం:నెమలి అనిల్
UPPAL CONGRESS NEWS
ఉప్పల్ (టైమ్‌టుడే):ఉప్పల్ గడ్డమీద మరో మరో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ అన్నారు.ఈ సందర్భంగా మంగళవారం ఆయన మల్లపూర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనిలోని ఓటర్లను కలిసి ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థి మందముల్ల పరమేశ్వర్ రెడ్డిని ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలందరికీ అందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.గత పదేళ్ల నుంచి బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అప్పులపాలు చేస్తుందని అన్నారు.అభివృద్ధిని మరిచి, ప్రతి బిఆర్ఎస్ నాయకుడు సంపాదించుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. అందుకు నిదర్శనం ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడమేనని అన్నారు. ఉప్పల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు రానున్న రెండు రోజులు సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం లో రావడం ఖాయమని పేర్కొన్నారు.
