గులాబీ గూటికి కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి
RAGIDI LAXMA REDDY TIME TODAY NEWS
కాప్రా (టైమ్‌టుడే):కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.ఉప్పల్ నియోజకవర్గంలో రెండున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించిన రాగిడి లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్టు కేటాయించకపోవడంతో రెండు రోజుల క్రితం రాజీనామా చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఇటీవల తెలిపారు. కాగా ఈరోజు సాయంత్రం మేడ్చల్ సభ కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం క్యాంప్ కార్యాలయంలో రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నట్లు సమాచారం.
