రికార్డ్ బుక్స్ విద్యార్థులకు ఉచిత పంపిణీ.
రికార్డ్ బుక్స్ విద్యార్థులకు ఉచిత పంపిణీ.
మధిర టౌన్ (టైమ్‌టుడే):ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సుదర్శన్ ఫౌండేషన్ బనిగండ్ల పాడు వారు ప్రాక్టికల్ రికార్డులను ఉచితముగా అందించటం జరిగింది. ఈ సందర్భంగా సుదర్శన్ ఫౌండేషన్ అధినేత జగదీష్ మాట్లాడుతూ ఉన్నత స్థితిని చేరుకొని విద్యార్థులు కూడా భవిష్యత్తులో పేదలకు సహాయం అందించాలని సూచించారు. 8 వేల రుపాయలు రికార్డులను అందించటం పట్ల ప్రిన్సిపాల్ రవణారెడ్డి, సిబ్బంది వారికి కృతజ్ఞతలు తెలియజేసి జగదీష్ దంపతులను ఘనంగా సస్మంచారు. ఈ సంవత్సర ప్రారంభంలో ఇదే సంస్థ చేత 26 వేల రుపాయల నోట్సు బుక్స్, పెన్నులును ఉచితంగా అందించటం జరిగింది.
TIMETODAY-ADMIN
