జ్యోతి నగర్ జడ్పీహెచ్ఎస్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

జ్యోతి నగర్ జడ్పీహెచ్ఎస్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

జ్యోతి నగర్ జడ్పీహెచ్ఎస్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

యైటింక్లయిన్ కాలనీ (టైమ్‌టుడే): రామగుండం మండలం జ్యోతి నగర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి పల్లెపాటి సంపత్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు బతుకమ్మ పండుగ విశిష్టత వివరించి కాసేపు పిల్లలతో సరదాగా బతుకమ్మ ఆడారు. ముందుగా పాఠశాల పీజీహెచ్ఎం జయరాజు విద్యార్థులు తయారుచేసిన బతుకమ్మలను వేదిక వద్దకు తీసుకువచ్చి కోలాట రృత్యాలతో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు సంతోషంగా ఆటపాటలతో వృత్యాలతో ముందస్తు బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులుగా పాటు ఉపాధ్యాయులు స్వర్ణలత, అనురాధ, స్వర్ణలత, రాజేశ్వరి, రాణి, అంజన్ కుమార్ ,పిఈటి శ్రీనివాస్ , సంతోష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.