జీనెక్స్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పంట దిగుబడి పై రైతుకు మెలుకులు
జీనెక్స్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పంట దిగుబడి పై రైతుకు మెలుకులు
గుండాల(టైమ్టుడే): గుండాల మండలం యాపలగడ్డ గ్రామం జినేక్స్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పంట దిగుబడి పై అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలోని రైతు ఈసం సమ్మయ్య హైబ్రిడ్ మొక్కజొన్న సింహా (1134) విత్తనాలు వేశానని మొక్కజొన్న కంకులు బారుగా బలమైన గింజలతో ఉన్నాయని దీనివల్ల అధిక దిగుబడి వచ్చిందని అన్నారు. కష్టపడి పండించిన రైతుకు అధిక దిగుబడి వచ్చినప్పుడే అసలైన ఆనందమని అన్నారు. ఈ సదస్సుకు 550 మంది రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ విత్తనాల వలన పంట పండించిన రైతుకు అధిక దిగుబడి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్లు మానాల ప్రభాకర్, మానాల ప్రణీత్, పట్వారి వెంకన్న, రైతులు పాల్గొన్నారు.
టైమ్టుడే.
