రోడ్లపైపుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే కఠిన చర్యలు
డిఎస్పీ రెహమాన్
కొత్తగూడెం(టైమ్‌టుడే):కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు,యువత ఎవరైనా సరే సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగే విధంగా రోడ్లపై పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని బడతాయని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు.వాహనదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా రోడ్లకు అడ్డంగా మరియు డివైడర్లపై పుట్టినరోజులు మరియు యూత్ ల పేరుతొ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ ఈ చర్యలు చేపడుతుందని వెల్లడించారు.
