కుంగ్ ఫు కరాటే పోటీలలో జాతీయస్థాయి బంగారు పథకాలు
కుంగ్ ఫు కరాటే లో జాతీయస్థాయి బంగారు పథకాలు
- కుంగ్ ఫుకరాటే పోటీలలో జాతీయస్థాయి బంగారు పథకాలు
- కొత్తగూడెం(టైమ్‌టుడే): జాతీయస్థాయి కుంగ్ ఫు కరాటే పోటీలలో ఎంతో అత్యంత ప్రతిభ కనపరిచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బంగారు పథకాలను తీసుకురావడం ఎంతో గర్వకారణం అని కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహమాన్ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందిగామలో జరిగిన జాతీయస్థాయి పోటీలకు టైక్వాండో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొగలి ఆధ్వర్యంలో కొత్తగూడెం నుంచి ఎనిమిది మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు వీరులు నలుగురు విద్యార్థులు రెండు బంగారు పథకాలు రెండు వెండి పథకాలను కైవసం చేసుకున్నారు కొత్తగూడెం కు చెందిన ఎన్ ప్రణయ్ కుమార్ , సిహెచ్ అన్వేష్ లు రెండు బంగారు పత కాలను సాధించారు. ఎం ప్రజ్వల్ బి వర్షిక్ లు వెండి పత కాలను సాధించారు. ఈ సందర్భంగా డిఎస్పి రెహమాన్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో కుంఫు కరాటే పోటీలలో ప్రతిభ ఘనపరిచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేయడం ఎంతో గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు మొగిలి, టైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రెజ్లింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ పి .కాశీ హుస్సేన్, కరాటే అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కరాటే సదానందం తదితరులు.
