రాజకీయ పార్టీలకు సమతా సైనిక్ ధళ్ వత్తాసు పలకదు

రాజకీయ పార్టీలకు సమతా సైనిక్ ధళ్ వత్తాసు పలకదు

రాజకీయ పార్టీలకు సమతా సైనిక్ ధళ్ వత్తాసు పలకదు

జహీరాబాద్ టౌన్ (టైమ్‌టుడే): రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్వయంగా స్థాపించిన సమతా సైనిక్ ధళ్ ఎంతో ఉన్నత ఆశయాలతో నిర్మాణమయిందని, సంఘం ఆశయాలను పక్కదారి పట్టిస్తే సహించేది లేదని సమతా సైనిక్ ధళ్ జహీరాబాద్ టీం హెచ్చరించింది. గురువారం జహీరాబాద్ పట్టణంలో గల అంబేద్కర్ భవన్ లో ఎస్ఎస్ఢి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల సమయం ఉన్నందున కొందరు వ్యక్తులు వారి స్వలాభం కోరి ఎస్ఎస్ డి మొత్తం మా వెనకాలే ఉందని రాజకీయ నాయకుల వద్ద చెప్పుకుంటున్నారని, అది సరైన పద్దతి కాదని హెచ్చరించారు. గత పది సంవత్సరాల గా జహీరాబాద్ సమతా సైనిక్ దళ్ నాయకులు పలు సామాజిక అన్యాయాలపై, దళిత సమస్యలపై, పోరాడుతూ వస్తుందని అన్నారు. సమతా సైనిక్ దళ్ సమానత్వం కోసం, సోదర భావం కోసం, సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించడం కోసం నిరంతరం పని చేస్తుందన్నారు. సమతా సైనిక్ దళ్ నుండి ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, పోటీ చేసే వ్యక్తులకు సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. ఈ సమావేశంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు బాలరాజు, జిల్లా నాయకులు రవికుమార్, శ్రీకాంత్, రాజు, శేఖర్, బాలకృష్ణ, కిరణ్, వై రాజు, ప్రసాద్, టిల్లు తదితరులు పాల్గొన్నారు.