ఉద్యోగులంతా ఒకే కుటుంబంగా క్రీడా స్ఫూర్తిని చాటాలి జిఎం రవిప్రసాద్

ఉద్యోగులంతా ఒకే కుటుంబంగా క్రీడా స్ఫూర్తిని చాటాలి జిఎం రవిప్రసాద్

ఉద్యోగులంతా ఒకే కుటుంబంగా క్రీడా స్ఫూర్తిని చాటాలి

జిఎం రవిప్రసాద్                 

 రెబ్బెన,(టైమ్‌టుడే): ఉద్యోగ క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయి లో రాణించి సింగరేణి సంస్థ కు మంచి పేరు తీసుకురావాలని, ప్రాంతాలుగా కాకుండా ఉద్యోగులు అంతా ఒకే కుటుంబంగా క్రీడా స్పూర్తి ని చాటాలని, వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ అసోసియేషన్స్ 90వ వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించిన సందర్భంలో ఏరియా జిఎం రవి పసాద్ అన్నారు. గోలేటి లోని శ్రీభీమన్న క్రీడా మైదానం లో నియర్ బై హాకీ పోటీలో పాల్గొన్న క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రోత్సహించారు. అనంతరం మందమర్రి, బెల్లంపల్లి ఏరియా జట్ల మద్య జరిగిన హాకీ పోటీలో 2-1 గోల్స్ తేడాతో బెల్లంపల్లి జట్టు గెలుపొందింది. ఈ కార్యక్రమంలో డీజిఎం(ఐఈడి)ఉజ్వల్ కుమార్ బెహరా, డివైపిఎం రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్, పిఓ ప్రశాంత్ స్పోర్ట్స్ కోఅర్డినేటర్ మురహరి రావు, జనరల్ క్యాప్టెన్ చంద్ర కుమార్, మందమర్రి, జనరల్ క్యాప్టెన్ చిన్నన్న, క్రీడాకారులు పాల్గొన్నారు