మ్యానిఫెస్టో అఫిడవిట్ రూపంలో ప్రజల ముందుంచాలి

మ్యానిఫెస్టో అఫిడవిట్ రూపంలో ప్రజల ముందుంచాలి
మ్యానిఫెస్టో అఫిడవిట్

మ్యానిఫెస్టో అఫిడవిట్ రూపంలో ప్రజల ముందుంచాలి 

: రాజకీయ పార్టీలకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలమెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి.

హైదరాబాద్(సిఎన్ఎన్ఐ): రాజకీయ పార్టీలు ప్రకటించే ఎన్నికల మ్యానిఫెస్టోలు ఎన్నికల తర్వాత చిత్తు కాగితాల వలె మారుతున్నాయన్న సగటు ఓటరు విమర్శలకు తావులేకుండా చట్టబద్ధ మ్యానిఫెస్టోలు ప్రజల ముందు ఉంచాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలమెంట్ కౌన్సిల్ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది.కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య సోమవారం బాగ్ లింగంపల్లిలో విలేకరులతో మాట్లాడారు.పాలనలో పాదర్శకతకు మ్యానిఫెస్టో ఒక కొలమానం కావాలని,అది రాజకీయ పార్టీలు. ఎన్నికల్లో లబ్ధికోసం అసాధ్య వాగ్దానాలు చేసి,ఆఖరికి హామీలనుంచి తప్పుకోవడం ప్రజాస్వామ్య విధానానికి పెనువిఘాతంగా మారే ప్రమాదముందన్నారు. రాజకీయపార్టీలు చేయగలిగే వాగ్దానాలతో ఒక అఫిడవిట్ రూపంలో ప్రజల ముందుంచాలని,అధికారం చేపట్టిన తర్వాత మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చకపోతే న్యాయస్థానాలు వేసే శిక్షలకు సిద్దం అని రాజకీయపార్టీలు ప్రకటించాలని రంగయ్య డిమాండ్ చేశారు.ఒక విజన్ లేని పార్టీలు రాజకీయ రంగం లోకి రాకుండా ఈ విధమైన చట్టబద్ద మ్యానిఫెస్టో కట్టడి చేస్తుందన్నారు.ఈ విధానం వ్యవస్థలో మంచి వాతావారణానికి బాటలు వేస్తుందని,పార్టీలు తమ సత్య శీలత నిరూపించుకొనేందుకు చట్ట బద్ధ మ్యానిఫెస్టో సమర్పించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.