సమాజ పురోగతికే సి ఎస్ ఆర్ నిధులు కోమటిరెడ్డి
సమాజ పురోగతికే సి ఎస్ ఆర్ నిధులు: కోమటిరెడ్డి
. హైదరాబాద్( టైమ్ టుడే ): పరిశ్రమలు అందజేసే కార్పోరేట్ సామాజిక బాధ్యత( సి ఎస్ ఆర్) నిధుల్లోని ప్రతి పైసా సమాజ పురోగతి కోసం ప్రభుత్వం వినియోగిస్తుందని రాష్ట్ర రహదారులు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన సాఫ్ట్ వేర్ సంస్థ ఏడిపి ప్రతినిధులతో సిఎస్ఆర్ నిధుల వినియోగంపై చర్చించారు. సమావేశంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ వర్ధన్ వేములపల్లి, డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ సుజన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..
