ఇంకెన్ని ప్రాణాలు బలి కోరుతావు కేసీఆర్ : బీపీ నాయక్
ఇంకెన్ని ప్రాణాలు బలి కోరుతావు కేసీఆర్ : బీపీ నాయక్
టీఎస్పీఎస్సీ ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి, నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్లను విడుదల చేయాలి
వైరా(టైమ్‌టుడే): కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొలువుల కోసం కొట్లాడైనా సాధించుకుందాం కానీ విలువైన ప్రాణాలు తీసుకోవద్దని రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్, వైరా అసెంబ్లీ బిజెపి నేత బీపీ నాయక్ నిరుద్యోగ యువతీ, తెలంగాణ బిడ్డ ప్రవల్లిక ఆత్మహత్యకు కారణం ఎవరని యావత్ తెలంగాణ అంతా ఆలోచించాలి. గ్రూప్-1 పరీక్ష రెండుసార్లు రద్దు చేయడం, గ్రూప్-2 పరీక్ష రెండుసార్లు వాయిదా వేయడం, గ్రూప్-3 పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో డేట్లు ప్రకటించకపోవడం, గ్రూప్ -4 పరీక్ష అసలు ఉందో లేదో తెలియకపోవడం కెసిఆర్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ నిర్వాహకం ఇలా తగలడిందని, 80 వేల ఉద్యోగాల భర్తీ చేస్తా అని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి, బూటకపు నోటిఫికేషన్లు ఇచ్చి తెలంగాణ నిరుద్యోగుల నుంచి వందల కోట్ల రూపాయలను ఫీజుల రూపంలో వసూలు చేసిన దుర్మార్గ ప్రభుత్వం కేసీఆర్ ది. ప్రాణాలు పణంగా పెట్టి, అప్పులు తీసుకొచ్చి అరకొర సౌకర్యంతో, అర్ధాకలితో హైదరాబాదు నగరంలో కోచింగ్లు తీసుకుని ఉంటే సరిగ్గా పరీక్షలు నిర్వహించలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం పేపర్ లీకేజీలకు పాల్పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న అనేక నిరుద్యోగులకు కారణం కెసిఆర్ కాదా అని ప్రశ్నించారు. ముమ్మాటికి ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలే, ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండడానికి అర్హులు కారు వీరు. బీఆర్ఎస్ పార్టీని పొందపెట్టాలి, టీఎస్పీఎస్ ను సంపూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లను ప్రకటించాలి. నిరుద్యోగులు ఎవరు తమ విలువైన ప్రాణాలను తీసుకోవద్దని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మన హక్కుగా కొట్లాడైనా ఉద్యోగాలు సాధించాలని తప్ప ప్రాణాలు తీసుకోవద్దని ప్రార్థించారు.
టైమ్‌టుడే.
