నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఎర్రుపాలెం(టైమ్‌టుడే): ఎన్నికలు కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని ఎస్ఐ ఎం సురేష్ తెలిపారు. ఎర్రుపాలెం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు మండలం కావడంతో విస్తృత తనిఖీలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 50 వేలకు మించి నగదు తీసుకు వెళ్లేవారు అందుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించాలని లేనిపక్షంలో అట్టి నగదును సీజ్ చేస్తామని ఆయన తెలిపారు. అలాగే రాజకీయ పార్టీల నేతలు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయరాదన్నారు. సోషల్ మీడియాలో సైతం ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయన్నారు.
టైమ్‌టుడే.
