బిఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలి.

బిఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలి.

బిఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలి.


మధిర (టైమ్‌టుడే): రాయపట్నం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికల విషయంపై కొందరు బిఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో వారు టిఆర్ఎస్ కాదు అని చెప్పుకుంటూ మేకపోతు గాంభర్యాన్ని ప్రదర్శిస్తున్న విధానాన్ని మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ ఖండించారు మీకు లాగా మీ కార్యకర్తలకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు అని చెప్పే సంస్కృతి మాకు లేదు గత ఐదు సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తూ వారు ఇస్తామని చెప్పిన పథకాల్లో ఒక్కటి కూడా నెరవేర్చినందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరబోతున్నామని స్వచ్ఛందంగా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరినారు. కానీ టిఆర్ఎస్ పార్టీకి ఈ విషయం పట్ల నష్టం వాటిల్లుతుందని గ్రహించి మా పార్టీ వారు కాదు అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు వారు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాకపోతే మీరే వెళ్లి వారితో మేము టిఆర్ఎస్ కాదు వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పించండి టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తున్న విధానాన్ని చూసి టిఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేక మిగతా క్యాడర్ ఎక్కడ జారిపోతారు అనేటువంటి భయంతో కాంగ్రెస్లో చేరుతున్నటువంటి వారు టిఆర్ఎస్ కార్యకర్తలు కాదని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారాని విమర్శించారు.