ఆకట్టుకున్న రెస్క్యూ రిలే పోటీలు
ఆకట్టుకున్న రెస్క్యూ రిలే పోటీలు

యైటింక్లయిన్ కాలనీ (టైమ్‌టుడే): అర్జీ-2 లో 52వ జోనల్ స్థాయి రెస్క్యూ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రెండవ రోజైన బుధవారం ఆరు జట్ల మద్య రెస్క్యూ రిలే పోటీలు ఆసక్తి కరంగా సాగాయి. కేరిం తలు చప్పట్లతో పోటీలలో పాల్గొన్న రెస్క్యూ సభ్యులను ఉత్సాహ పరిచారు. ఉదయం నుండి సుమారు 3 గంటల పాటు ఈ పోటీలు కొనసాగగా ఏరియా జనరల్ మేనేజర్ ఎల్.వి. సూర్యనారాయణ, కార్పొరేట్ సేఫ్టీ జీఎం గురువయ్యా, రీజియన్ సేఫ్టీ జీఎం ఎస్. సాంబయ్య మరియు జీఎం రెస్క్యూ ఎస్.వెంకటేశ్వర్లు పోటీల తీరుతెన్నులు గమనించారు.ఈ పోటీలో ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడడం కోసం వారికి ఎదురయ్యే అవాంతరాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసి ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడడం ఈ ప్రాక్టీస్ యొక్క ఉద్దేశం. టిమ్ సభ్యులు తక్కువ సమయంలో టాస్క్ ను పూర్తి చేయవలసి ఉంటుంది. దిమ్మెను 5 సార్లు పైకి ఎత్తలి, రెండు సిలెండర్స్ తో బీమ్ బ్యాలెన్స్, 30 మీటర్ల హోస్ ద్వారా ఫైర్ ఫైటింగ్ చేయడం, 5 సార్లు పుల్లప్స్ చేయడం, రంపంతో కర్రను కోయడం, కిట్ ధరించి హైడ్రాలిక్ మిషన్ ద్వారా అవాంతరాలను తొలగించడం, కిట్ ధరించి క్లిస్టమైన దారిలో పాకుతూ వెళ్ళడం, 40 కేజీల 5 సాండ్ బ్యాగ్స్ ఎత్తి పైకి వేయడం, ఎల్హెచ్డి టైర్ ను 5 సార్లు లేపడం, అనంతరం సృహలో లేని వ్యక్తిని ఎత్తుకొని వెళ్ళి సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ఈ టాస్క్ పూర్తి అవుతుంది.ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డీడీఏంఎస్ అధికారులు వ్యవహరించారు.
ఈ పోటీలను ఎస్ఓ టు జీఎం అబ్దుల్ సలీం, రెస్క్యు సూపరిం టెండెంట్ మాధవ రావ్ మరియు రెస్క్యు అధికారులు పర్యవేక్షించారు.
టైమ్‌టుడే.
