నేతాజీ ధైర్యసాహసాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు చేపడుదాం   

యువతను ముందుండి నడిపిన ఘనత అయనదే

నేతాజీ ధైర్యసాహసాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు చేపడుదాం   
నేతాజీ చిత్రపటానికి పూల మాలలు వేస్తున్న నాయకులు

కొత్తగూడెం(టైమ్‌టుడే): ధైర్యసాహసాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను చేపట్టాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పిలుపునిచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో యువతను ముందుండి నడిపించిన ఘనత ఆయన సొంతమన్నారు. ఆంగ్లేయుల గుండెల్లో దడ పుట్టించిన యోధుడు ,ఆయన స్పూర్తితో దేశం కోసం పాటుపడల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతాజీ చేసిన ఉద్యమాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తూము చౌదరి, ఆళ్ల మురళి, ఐఎన్టియూసి నాయకులు డాక్టర్ శంకర్ నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు చీకటి కార్తీక్, పూనెం శ్రీనివాస్, పాల సత్యనారాయణ రెడ్డి, టీజేఎస్ శివ, దుంపల రాజేష్, వనమా రాము, బాల ప్రసాద్, సుందర్ లాల్ కోరి, సంపత్, రాము, కనకరాజు, గోరేబాబు, ఐఎన్టీయూసీ నాయకులు సోమిరెడ్డి ఎండి రజాక్, భాస్కర్, నాగిరెడ్డి, జెల్లి కిరణ్, భారత్, చిరంజీవి, ఎన్ఎస్ యూఐ మరేశ్, మధు, ప్రణయ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.