అయోధ్య శ్రీరాముని అక్షింతల పంపిణీ

శ్రీరాముని అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేశారు

అయోధ్య శ్రీరాముని అక్షింతల పంపిణీ
SRIRAM TEKULAPALLI IMG

అయోధ్య శ్రీరాముని అక్షింతల పంపిణీ

టేకులపల్లి(టైమ్‌టుడే): శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని శనివారం టేకులపల్లిలో గడప గడపకు నిర్వహణ కమిటీ తిరుగుతూ ఈ అక్షంతల పంపిణీ చేపట్టారు. మహిళలు సాంప్రదాయక దుస్తులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయోధ్యలోని అక్షింతలను రామనామ స్మరణతో అక్షింతల విశిష్టతను వివరిస్తూ గ్రామాల్లోని పురవీధుల్లో తిరుగుతూ ఇంటింటికి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలో ఈనెల 22వ తారీఖున బాల శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారని! ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి, అక్షింతలను శిరస్సుపై జల్లుకొని పెద్దవారి ఆశీస్సులను పొందాలని తెలిపారు.ఇలా చేయడంతో అయోధ్యలోని శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో స్వయంగా భాగస్వాములవుతామని తెలిపారు. ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమంలో. సర్పంచ్ బోడ సరిత, ఎంపీటీసీ అప్పారావు, ఇస్లావత్ రెడ్యానాయక్ ,పుణ్య నాయక్, లాలు నాయక్, బోడ బాలు, జ్యోతి నాయక్, బొడ్డుపల్లి బ్రహ్మచారి ,గుడిపూడి కృష్ణార్జున్ రావ్ , రాయల అన్వేష్, రాధాకృష్ణ, నాగమణి, రోజా రాణి, జ్యోతి, గౌతమి, రమాదేవి, పార్వతి, తోటకూరి చిట్టెమ్మ, కార్యకర్తలు,భక్తులు,తదితరులు పాల్గొన్నారు.