విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం పెరగాలి
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభం
కొత్తగూడెం (టైమ్టుడే):విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం పెరగాలని జెఎన్టియు హైద్రాబాద్ వి సి ఓ ఎస్ డి ప్రొఫెసర్ బాలు నాయక్ టీఎస్ జెన్కో డిఇ బి మంగీలాల్ లు అన్నారు మండలంలోని వేపలగడ్డను అందుకు అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాల నందు బుధవారం నాడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జెనరిక్స్ 2కె 23 పేరుతో నేషనల్ లెవల్ టెక్నికల్ ఫస్ట్ మూడు రోజులు పాటు నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని కళాశాల యాజమాన్యంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదటిరోజు ప్రాజెక్ట్ ఎక్స్పో, కలర్ఫుల్ పోస్టర్ ప్రెసెంటేషన్, పేపర్ ప్రజెంటేషన్లు,విద్యార్థులు వారి వర్కింగ్ ప్రాజెక్ట్ మోడల్స్ ను ప్రదర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా మంచి లక్షణాలతో విద్యను అభ్యసించడం ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు తమలోని ప్రతిభని ఉపయోగించి సామాన్యులకు అర్థమయ్యే విధంగా ప్రాజెక్టు తయారు చేసినందుకు వారిని అభినందించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వి సీతారాం ప్రసాద్, శ్రీకాంత్,సైదయ్య, రమేష్,ఈఈఈ హెచ్ఓడీలు బాబురావు, లక్పతి,సురేష్ శిరీషయ్య, శ్రావణి,దివ్య,ఉమా తదితరులు పాల్గొన్నారు
