ముక్కోటి ఏకాదశి సమాచార కరపత్రాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు భద్రాచలం విచ్చేయు భక్తులకు సమాచార కర పత్రం ఉపయోగ పడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ తయారు చేసిన సమాచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాల సమాచారాన్ని భక్తులు తెలుసుకోవడానికి ఈ కరపత్రం ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కరపత్రంలో దేవస్థానానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు బస్సులు, రైళ్లు సమాచారం, ప్రసాదపు కౌంటర్లు, మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలాలు, ప్రాథమిక వైద్య కేంద్రాలు తదితర సమాచారం పొందుపరచడం జరిగిందని చెప్పారు. అలాగే భక్తులకు సమాచారం అందించడానికి సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిపిఆర్ఓ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, డిపిఆర్వో శ్రీనివాస్, జడ్పి సీఈఓ విద్యాలత, వైద్యాధికారి డాక్టర్ శిరీష, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
