వారం రోజుల్లో వంతెన నిర్మాణం పనులు ప్రారంభించాలి
వంతెన పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి
వారం రోజుల్లో భద్రాచలం వద్ద వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణ పనుల ప్రగతిపై ఆదివారం ఐటిసి విశ్రాంతి భవనంలో జాతీయ రహదారుల అ

ధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2002లో కేంద్రమంత్రి బిసి కండూరితో మాట్లాడి (విజయవాడ) ఇబ్రహీంపట్నం నుంచి భద్రాచలం వరకు 165 కిలో మీటర్ల రహదారిగా ప్రకయించినట్లు చెప్పారు. వెయ్యి కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను 2015 సంవత్సరంలో నితిన్ గడ్కరీ కలిసి తాను శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. 2015 నుండి 2023 సంవత్సరం వరకు వంతెన పనులు జరుగుతూనే ఉన్నాయని, రానున్న ఫిబ్రవరి మాసాంతం వరకు వంతెన పనులు ఏ మాత్రం పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణ పనులపై మంత్రి ఫోన్ ద్వారా ఈఎన్సి గణపతి రెడ్డి, భారతప్రభుత్వ జాతీయ రహదారుల విభాగం ప్రాంతీయ మేనేజర్ కుష్వాలతో మాట్లాడి తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి నితిన్ ఘట్కరితో తాను మాట్లాడుతానని ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని ఆయన సూచించారు.
జాతీయ రహదారుల శాఖ ఈఈ యుగంధర్, డిఈ శైలజ తదితరులు పాల్గొన్నారు.
